Header Banner

టికెట్ వెనుక ఆర్టీసీ కండెక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

  Thu Feb 27, 2025 12:36        Travel

ఆర్టీసీ బస్సులో టికెట్ కు సరిపడా చిల్లర లేకుంటే పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. దిగేటప్పుడు తీసుకొమ్మంటూ కండక్టర్ టికెట్ వెనుక రాసివ్వడం జరుగుతుంటుంది. గమ్యం చేరుకున్నాక చాలామంది హడావుడిగా బస్సు దిగి వెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో టికెట్ వెనుక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. ఇంటికి వెళ్లాక గుర్తొచ్చినా చేసేదేంలేక బాధపడుతుంటారు.

 

అయితే, ఇకపై ఇలా డబ్బులు నష్టపోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా చిల్లర తీసుకోవడం మర్చిపోతే ఆ టికెట్ పై ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 040-69440000కు సమాచారం ఇస్తే, విచారణ అనంతరం వారికి రావాల్సిన డబ్బులు ఫోన్‌పే చేస్తామని చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇలా చిల్లర డబ్బులు మాత్రమే కాదు, బస్సులో మర్చిపోయిన వస్తువులనూ తిరిగి పొందవచ్చని తెలిపారు. బస్సులో విలువైన వస్తువులు, బ్యాగులు, సెల్‌ ఫోన్లు, ఇతర వస్తువులు మర్చిపోతే హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించి వాటిని తిరిగి పొందవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు, దూర ప్రయాణం చేసే సందర్భాలలో భోజనం కోసమో, టిఫిన్ కోసమో బస్సు మార్గమధ్యంలో ఆపడం తెలిసిందే.

 

అయితే, భోజనం చేసి వచ్చే లోపు బస్సు వెళ్లిపోతే కూడా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు. దీంతో అదే టికెట్ పై మరో బస్సులో గమ్యం చేరుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తారు. మొదటి బస్సులోని లగేజీని భద్రంగా అందజేస్తారు.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Telangana #RTC #TGSRTC #RTC